నా కలలో నువ్వే నా జీవితం అనుకొన్నాను. కానీ, నా జీవితంలో నువ్వు ఎప్పటికి కలగానే మిగిలిపోయావు.

సత్యాన్వేషణ

అప్పుడు ఉన్నది లేదు 
ఇప్పుడు లేనిది లేదు 
జత కలిసి నడిచిన జాడ లేదు 
జాడలు మరచిన ఊసే లేదు

స్వాగతించిన క్షణం లేదు 
వీడ్కోలు పలికిన స్థితే లేదు 
కలలే లేవు ఇక్కడ 
మరి ఇక కల్లలకు చోటెక్కడ 
ఊహగా జరిగిన సంఘటన లేదు 
వాస్తవంగా మిగిలిన జ్ఞాపకం లేదు

పరుగులు తీసే మనసుకు పగ్గం వేయక 
లేనిది వరిస్తూ, చేరువ ఉన్నదాన్ని వదిలేస్తూ 
జీవితాన్ని విస్మరిస్తూ
అన్నీ తెలిసిన మూర్ఖత్వమా?
ఏమి తెలియని అమాయకత్వమా?

మధుర ఊహాల పరిమళాన్ని ఆస్వాదించు 
గులాబీ గుభాళింపులను గుండెల్లో దాచుకో 
జీవితం అంటే ఓ మధుర జ్ఞాపకం 
పదిలంగా దాచుకో 
మనసులో మధుర జ్ఞాపకంగా నిలిచిపో... 

source: ఉమా దేవి