నా కలలో నువ్వే నా జీవితం అనుకొన్నాను. కానీ, నా జీవితంలో నువ్వు ఎప్పటికి కలగానే మిగిలిపోయావు.

ఇలా నా జతగా...!

ఇలా నా జతగా తనే రాకున్నా 
ఎటువైపో నడక దారే లేకున్నా 
గతం నా వెనుక నిజంలా ఉన్నా
అలా ఆ నిజమే కలై పోతున్నా   
బదులివ్వని మౌనం
నా యద మోయలేదే ఈ భారం 

నే వెళ్లే ఏ దారైనా
నా ప్రేమే ఎదురొస్తున్నా
నా జంటై నువ్వంటూ లేక 
మౌనంగా దాటేస్తున్నా 
నన్నే నువ్వే కాదనుకొంటున్నా ఇలా 
నాకె నేనే ఒంటరినై ఉన్నా ఎలా 

ఇన్నాళ్లు నాతో ఉన్న నీ స్నేహం లేదంటున్నా
నీ రూపం ఇంకా నాలోన కన్నీరై చూస్తుండగా 
కాలం నిన్నే దూరం చేస్తున్నా ఇలా 
నాలో ఇంకా నిన్నే చూస్తున్నా ఎలా 

యదనే తడిమే తపనే నీవే 
పలికే బదులై రావా 
గతమే కలని అనవే 
రగిలే వ్యధని చెబితే వినవే ప్రేమ 
తరిమే కలతే చూపే దూరం 
ప్రాణం మోసే భారం 
ఈ మౌనం దాటాలి ఓ మూగ మనసా.....