నా కలలో నువ్వే నా జీవితం అనుకొన్నాను. కానీ, నా జీవితంలో నువ్వు ఎప్పటికి కలగానే మిగిలిపోయావు.

Invest your own happiness for a change...

ఎన్ని మార్పులో 
కనిపించే మనిషిలో, కనిపించని మనసులో
ఒక నాడు అత్యంత విలువైన స్నేహం, బంధం, 
నేడు విలువ లేక వెల వెల పోతున్నది
ఒక నాడు వెల్లువై పెల్లుబికిన ఆత్మీయత, అనురాగం 
నేడు ఇంకిపోయి బీడువారి పోయినది
ఒక నాడు క్షణ క్షణం ఊపిరిగా ప్రాణంగా పంచుకొన్న ప్రేమ 
నేడు కాలగర్భంలో కలిసి మాయమయింది
నిజమే అమలిన ప్రేమ, ఆశించని బంధాలు, 
స్వార్ధమెరుగని అనుబంధాలు ఎవరికి కావాలి ?? 
అవి లేవని ఆక్రోశిస్తాము , అవేదన పడతాము. 
కానీ వాటిని కాపాడము 
నిందలతో దూరం చేసుకొంటాము
ప్రేమ అనే పదము అమృతమే 
దానిలో అసూయ, ద్వేషం, ఈర్ష, స్వార్ధం అనే 
విషపు చుక్కలు కలపనంతకాలమూ
కాల గతిలో కన్నీటి చుక్కలతో రాసుకున్న 
ఆత్మీయ గీతం శిలా శాసనమై 
హృదయ ఫలకంలో ఎన్నటికీ పదిలమే