నా కలలో నువ్వే నా జీవితం అనుకొన్నాను. కానీ, నా జీవితంలో నువ్వు ఎప్పటికి కలగానే మిగిలిపోయావు.

My Dear Castro...

నిన్నటి వరకూ ఒక్కమగాడు బతికుండే వాడనీ
వాడు..అందరి ఆకలీ తీరాక గిన్నెలో ఇంకా 
నాలుగు మెతకులు మిగలాలనే కలకనే వాడనీ
ఎండిన క్యూబా అమ్మల చన్నులను చూసి 
గుక్కపట్టిన లేత హృదయాల బాష వాడికి తెలుసనీ 
వడ్లగింజంత క్యూబాను బరిసెను చేసి 
అగ్రరాజ్యం పీకల మీద ఎర్ర సంతకాన్ని చేసాడనీ
దేశంలోకి డాలర్ల ప్రవాహానికి 
వాడి రక్తపు ముద్దను అడ్డం పెట్టాడనీ
ఎవ్వరూ చెప్పుకోరు కాస్ట్రో
నిన్నూ, నీ కథనూ ఒట్టి కట్టు కథను చేస్తారు
ఉమ్మితే తుడిచేసుకునే వాళ్ళం 
ఈ శతాబ్దాన్ని క్షమించు
ఏం చేయగలను కాస్ట్రో నీకోసం..
నిద్దురపోతున్న నీ ముందూ, 
క్యూబా హృదయాల్లో విహరిస్తున్న నీ కలల ముందూ 
ఒక్క చుట్టముక్కను ఉంచటం తప్ప...
నిద్రపో కాస్ట్రో... నిద్రపో... 
90 ఏళ్ళ మెలుకువ తర్వాత మళ్ళీ నిద్రపో
చాలా మామూలు రోజుల తర్వాత 
ఉదయంలానో, వర్షంలానో నా దేశం మీద పడు
నీ కోసం కలలు కంటాం, పాటలు కడతాం
నెత్తురుని కూడగట్టుకుంటాం
వెయిటింగ్ ఫర్ యూ కాస్ట్రో 

#copied