నా కలలో నువ్వే నా జీవితం అనుకొన్నాను. కానీ, నా జీవితంలో నువ్వు ఎప్పటికి కలగానే మిగిలిపోయావు.

అల్లకల్లోలం...

ప్రశాంతమైన సరస్సులో రాయి విసిరితే…
చల్లని చందమామ వెలుగును కబళిస్తే…
సాఫీగా సాగే నావకు బండరాయి మోదితే..
స్వేఛ్ఛగా ఎగిరే విపంచికి రెక్కలు కత్తిరిస్తే…
మల్లెపూల పల్లకిపై నిప్పులు చల్లితే…
తెల్ల కాగితంపై నల్ల కాకి రెట్ట వేస్తే……
కమ్మని కలలో అకస్మాత్తుగా మెలకువ వస్తే…
గుమ్మపాలలో చిటికెడంత ఉప్పు చిలకరిస్తే…
రుచికరమైన భోజనంలో పంటికింద రాయి పడితే….
రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని బలవంతంగా గుంజుకుంటే…
నా కష్టార్జితంపై ఎవరో ఆంక్షల అంకుశం గుచ్చుతుంటే…
నమ్మకం ఉండాల్సిన చోట అప నమ్మకం బుసలుకొడితే…
విశ్వాసం అవిశ్వాసంగా మారి ఊబిలోకి లాగుతుంటే…
తలెత్తుకొని బతకాల్సిన చోట అవమానం వెంటాడితే…
అవగాహన కొరవడిన పాలకుల ప్రవచనాలు జోరీగలైతే….
సంక్షేమ రాజ్యంలో ప్రజల బతుకులు సమస్యగా మారితే…
వ్యవస్థలో కల్లోలం.. బతుకుల్లో అల్లకల్లోలం.. 
వర్తమానం అంధకారం!!