నా కలలో నువ్వే నా జీవితం అనుకొన్నాను. కానీ, నా జీవితంలో నువ్వు ఎప్పటికి కలగానే మిగిలిపోయావు.

హృదయాంతరంగం

అహంకారం ఎరుగని సరిహద్దులకు
నా మనసు విస్తరించనీ,
అలంకరణలకు విలువివ్వని
అభిమానాన్ని సంతరించుకోనీ,
ఆప్యాయతానురాగాల భావాల
సమున్నత్వాన్ని పెంపోందించుకోనీ,
ఈ విశాల విశ్వాంతరాళంలో 
నా మానసిక సౌందర్యం విస్తరించి ప్రకాశించనీ, 
నా హృదయ సీమ లోని ప్రతి కణం ఈ ప్రకృతి పై
అవ్యాజ్య అభిమానాన్ని నిలుపుకోనీ,
నా మనోగగనాన స్నేహ మధురిమల పరిమళాలు
నా శ్వాస నాళాల్లో ప్రాణవాయువు
ప్లవించే వరకు గుబాళించనీయనీ....