నా కలలో నువ్వే నా జీవితం అనుకొన్నాను. కానీ, నా జీవితంలో నువ్వు ఎప్పటికి కలగానే మిగిలిపోయావు.

తెగిన గాలిపటం

ఆకాశం అంతా 
దిగులు కమ్మేసింది ఈ పూట

మాటలన్నీ రాలిపోయాక 
మౌనం ముళ్ళు గుచ్చుకుంటున్నాయి 

కలవరపడే మనసు కన్నీరు ఇంకిపోయి 
కానరాని సంతోషాన్ని వెతుకుతోంది

జారిపోయిన అద్భుతాలు 
ఙ్ఞాపకాలై అల్లుకుంటున్నాయి

లయమైన గుండె చప్పుళ్ళు 
ఇప్పుడు బరువనిపిస్తోంది 

ఏకమైన శ్వాసల ఊపిరి 
ఇప్పుడు భారమవుతోంది

నిట్టూర్పు వెచ్చదనం 
ఆశని హత్తుకుంటున్నా 

అహం పొద్దుల్లో అస్తమించిన బంధం 
చరిత్ర పుటలకెక్కని చెదిరిన కల 
తీరం చేరని ఎగసిపడిన అల