నా కలలో నువ్వే నా జీవితం అనుకొన్నాను. కానీ, నా జీవితంలో నువ్వు ఎప్పటికి కలగానే మిగిలిపోయావు.

నాన్నకు ప్రేమతో

సంతోషాలను మాకు ఇచ్చి 
సంతాపాలు నువ్వు మోసి 
మేము అడిగినవి ఇచ్చేసి 
నువ్వు అడగడమే మానేసి 
అన్ని భుజాలకి ఎత్తుకొని 
ఎన్నో నిజాలు దాచుకొని 
ఒంటి స్తంభం మేడల్లే
ఒంటరి సైన్యంలా నువ్వే 
జీవితమంతా నడిచి నడిచి 
అలుపొచ్చిందా నాన్న 
మళ్లీ ఒకసారి 
నీ చిటికిన వేలుని పట్టుకొని 
నడిచే అదృష్టం నాకిస్తావా...!
నీ చూపుడు వేలితో 
ప్రపంచాన్ని పరిచయం చేస్తావా?

#copied