నా కలలో నువ్వే నా జీవితం అనుకొన్నాను. కానీ, నా జీవితంలో నువ్వు ఎప్పటికి కలగానే మిగిలిపోయావు.

పెద్ద పండుగ...

పెద్ద పండుగ, పెద్ద పండుగ!
పెద్ద పండుగ, పేరు దండుగ!

తిండి లేక దిక్కు లేక
దేవులాడే దీన జనులకు
పండుగెక్కడ? పబ్బమెక్కడ?

ఎండు డొక్కల పుండు రెక్కల
బండ బతుకుల బానిసిండ్రకు
పండుగేమిటి? పబ్బమేమిటి?

ఉండడానికి గూడులేక
ఎండ వానల దేబిరించే
హీనజనులకు పేదనరులకు
పండగోకటా? పబ్బమొకటా?

పెద్ద పండుగ, పెద్ద పండుగ!
పెద్ద పండుగ, శుద్ధ దండుగ!

--- పెద్ద పండుగ // మరో ప్రస్థానం [1970]