నా కలలో నువ్వే నా జీవితం అనుకొన్నాను. కానీ, నా జీవితంలో నువ్వు ఎప్పటికి కలగానే మిగిలిపోయావు.

మనసు గతి ఇంతే...!

అమ్మ సాక్షి ....  నాన్న సాక్షి ....
ఏ జన్మకు చావని ఆశల సాక్షి ...
నాలో నేను ఒకటయ్యాను
ఎదురుపడిన కలను నిజమనుకున్నాను
ఇంతకూ ఎంతవరకీ  పయనం
చావు పుట్టుకలు మధ్య గమనం
అర్ధం పర్ధం లేని ఈ  తతంగం
సంగతేంటో తేల్చని అంతరంగం
అపురూపమైనది మురిపించే జీవన గానం
అన్వేషణలో తేలిన సత్యం ఒక్కటే
మనిషి మనసొక అగాధం
మనిషికి మనసే బలహీనం , బలోపేతం
నిత్యం నైరాశ్యం అయినా
మరో జన్మకై తపించే సుందర స్వప్నం

Source: Yashoda