నా కలలో నువ్వే నా జీవితం అనుకొన్నాను. కానీ, నా జీవితంలో నువ్వు ఎప్పటికి కలగానే మిగిలిపోయావు.

రాజధానిలో ఓ గ్రామం

తల్లంటి పల్లె నేడు తల్లడిల్లి పోతుఉంది, ఏనాటి పాపమిది?
నీడ ఇచ్చే ఊరే నేడు మోడల్లే ఏడుస్తుంది, ఎవ్వరి శాపమిది? 
పచ్చంగా ఉండే పల్లె, ఈ చిచ్చులో కాలిందయ్యో 
వెచ్చంగా ఉండే గూడు, కసి కక్షల్లో రాలిందయ్యో 
ఒడి చేరే పంటలు నేడు రక్కసి మూకలు కాల్చేసే
కడ దాకా తోడనుకున్న గూడును నిలువునా కూల్చేసే 
ఏ పాపం ఎరగని వాళ్ళం 
మేము ఏనాడు తెరవని నోళ్ళం 
మోసపోయామే అన్నిటికి చెడ్డామే, 
పోరాటమే మిగిలింది