నా కలలో నువ్వే నా జీవితం అనుకొన్నాను. కానీ, నా జీవితంలో నువ్వు ఎప్పటికి కలగానే మిగిలిపోయావు.

ఆత్మవిశ్వాసం

ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యాన
రాజు నువ్వే, బంటు నువ్వే 
మంత్రి నువ్వే, సైన్యం నువ్వే
ఏది ఏమైనా నువ్వు నడిచే దారిలో 
ప్రశ్న నువ్వే, బదులు నువ్వే 
అన్ని నువ్వే కావాలి 
అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి 
అవమానలే ఆభరణాలు, 
అనుమానాలే అనుకూలాలు, 
సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు 
అలసినా సొలసినా 
ఎవరికీ పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి 
బలము నువ్వే, బలగం నువ్వే 
ఆట నీదే, గెలుపు నీదే 
కలలుగన్న శుభోదయం రావాలంటే
చీకటి తెరలు తొలగాలి ....