నా కలలో నువ్వే నా జీవితం అనుకొన్నాను. కానీ, నా జీవితంలో నువ్వు ఎప్పటికి కలగానే మిగిలిపోయావు.

యాంత్రిక జీవనం...

రోజులు, గంటలు, నిముషాలు, క్షణాలు అంటూ కాలం కొలతల్లో బంధీ అయిన జీవితం
ఆగకుండా కదిలే కాలచక్రంతో పోటి పడే ఉరుకుల పరుగులు
పరుగు పందెం లో అలసి ఆగిపోతున్న అనుబంధాలు, అనుభూతులు, ఆప్యాయతలు
ఎంతగా అలసినా సేద తీరేందుకు సమయం లేదు
ప్రతి మనిషికి ముందు చూపే కాని
తన చుట్టుపక్కల ప్రపంచం ఏమైపోతుందో తెలుసుకోవాలన్న ఇంగితం లేదు
జీవిత గమనంలో ఎదురయ్యే సమస్యలకు గూగుల్ సమాధానాలు తప్ప
సాటి మనిషితో చర్చించే సమయం లేదు; సందర్భం రాదు.
ఈ జీవిత పోరాటంలో బంధువులు, స్నేహితులే మన ప్రత్యర్థులు
అందరు అయిన వారే అయినా ఎవరికీ వారే పోటి
ఒకరికంటే నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి అనే తాపత్రయం,
గెలుపు ఓటములు, లాభ నష్టాల బేరీజులో సుఖ శాంతులకి చోటే లేదు
ఉన్నది లేదనుకొని, లేనిది కావాలనుకొని
ఏదో సాధించాలని, ఎంతో ఎదగాలని, ఎక్కడికో చేరుకోవాలనే,
ఈ ఆశల, ఆశయాల పరుగు ఎక్కడికో... ఎందాకనో....